Monday, 29 August 2016

మిత్రులంద‌రికీ, శుభ‌సాయంత్రం. నేటి ఉద‌యం ప్ర‌కాశం తపాలా విభాగ కార్యాల‌య‌మునందు, తెలుగు భాషా దినోత్స‌వంను పురస్క‌రించుకొని, ఒక‌ కార్య‌క్ర‌మ‌మును నిర్వ‌హించాము .ఈ కార్యాల‌య‌ములో ప‌నిచేయుచున్న‌ స‌హాయ‌కుల‌నంద‌రినీ , మూడు నిమిష‌ములు ఎటువంటి ఆంగ్ల‌ ప‌ద‌ములు వాడ‌కుండా కేవ‌లం తెలుగులో మాట్లాడే పోటి నిర్వ‌హించారు. ఇందులో, ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. పోటిలో విజేత‌ల‌కు చిన్న‌ బ‌హుమ‌తులు కూడా ఇవ్వ‌డం జ‌రిగిన‌ది. ప్ర‌థ‌మ‌ బ‌హుమ‌తి శ్రీమ‌తి. సుమ‌తి, భ‌వ‌న‌ శాఖ‌ స‌హాయ‌కురాలు , ద్వితీయ‌ బ‌హుమ‌తి శ్రీమ‌తి శ్రీదేవి గారు, పిర్యాదుల‌ శాఖ‌, త్రుతీయ‌ బ‌హుమ‌తి శ్రీ సురేష్, సిబ్బంది శాఖ‌ మ‌రియు శ్రీ క్రిష్న చైత‌న్య‌ , ఇన్స్పెక్ట‌ర్ పోస్ట్స్ వారికి అంద‌చేయడం జ‌రిగిన‌ది.





No comments:

Post a Comment