Monday 29 August 2016

మిత్రులంద‌రికీ, శుభ‌సాయంత్రం. నేటి ఉద‌యం ప్ర‌కాశం తపాలా విభాగ కార్యాల‌య‌మునందు, తెలుగు భాషా దినోత్స‌వంను పురస్క‌రించుకొని, ఒక‌ కార్య‌క్ర‌మ‌మును నిర్వ‌హించాము .ఈ కార్యాల‌య‌ములో ప‌నిచేయుచున్న‌ స‌హాయ‌కుల‌నంద‌రినీ , మూడు నిమిష‌ములు ఎటువంటి ఆంగ్ల‌ ప‌ద‌ములు వాడ‌కుండా కేవ‌లం తెలుగులో మాట్లాడే పోటి నిర్వ‌హించారు. ఇందులో, ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. పోటిలో విజేత‌ల‌కు చిన్న‌ బ‌హుమ‌తులు కూడా ఇవ్వ‌డం జ‌రిగిన‌ది. ప్ర‌థ‌మ‌ బ‌హుమ‌తి శ్రీమ‌తి. సుమ‌తి, భ‌వ‌న‌ శాఖ‌ స‌హాయ‌కురాలు , ద్వితీయ‌ బ‌హుమ‌తి శ్రీమ‌తి శ్రీదేవి గారు, పిర్యాదుల‌ శాఖ‌, త్రుతీయ‌ బ‌హుమ‌తి శ్రీ సురేష్, సిబ్బంది శాఖ‌ మ‌రియు శ్రీ క్రిష్న చైత‌న్య‌ , ఇన్స్పెక్ట‌ర్ పోస్ట్స్ వారికి అంద‌చేయడం జ‌రిగిన‌ది.





Thursday 18 August 2016

పత్రికా ప్రకటన


ప్రకాశం డివిజన్ పోస్టల్ పరిధిలో కేటగిరి వారీగా ఈ క్రింద తెలిపిన పోస్ట్ మెన్/ మెయిల్ గార్డ్ పోస్టులను భర్తీ చేయుటకు ఆసక్తి గల అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరడమైనదని ప్రకాశం డివిజన్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ గారు తెలియజేయుచున్నారు.

OC-3  SC-1 OBC-1   total-5 మరియు మాజీ సైనికులకు ఒక పోస్టు రిసర్వ్ చేయడమైనది.
ఆసక్తి గల అభ్యర్దులు ఈ క్రింద తెలిపిన పోస్టాఫీసుల్లో ఆన్లైన్ లో పరీక్ష ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చును.తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్స్ కి విడివిడిగా పరీక్ష వుంటుంది.కావున ఒకే అభ్యర్ధి తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్స్ కి అప్లై చేసుకోవచ్చును. పరీక్ష ఫీజును ఈ క్రింద తెలిపిన పోస్టాఫీసుల్లో చెల్లించ వచ్చును. 

ఒంగోలు HO; కందుకూరు HO; కనిగిరి HO;చీరాల HO; సింగరాయకొండ SO;పర్చూరు SO; పొదిలి SO; అద్దంకి SO; లాయరుపేట SO.

ఆన్లైన్లో అప్లై చేయుటకు ఆఖరు తేది 04.09.16. ఇతర వివరముల కొరకు మీరు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించగలరు.

=TAV SARMA, SSPOs, Prakasam Division, Ongole – 523 001.

Wednesday 17 August 2016


డయల్ యువర్ SSP - 23.08.2016 తేదీన 1000 నుండి 1200 గంటల వరకు

DEPARTMENT OF POSTS: INDIA
Office of the Sr.Supdt.of Post Offices, Prakasam Division, Ongole-523 001
To
All the GDS BPMs in Prakasam Division.

No.L/AEPS/Corr dated at Ongole-523001 the 17.08.2016

ప్రియమైన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు,
           విషయము:-   NREGS చెల్లింపులు చేయుటలో సౌకర్యములు/అసౌకర్యముల విషయములను    
                                  ఫోన్ ద్వారా తెలియపరుచుట గురించి

             మన ప్రకాశం డివిజన్ నందు  NREGS  చెల్లింపులు  సజావుగా జరుపుటలో మీకు ఏవైనా   అసౌకర్యములు కలుగుచున్నచో వాటి గురించి ఫోన్ ద్వారా సంభాషించుటకు గాను  23.08.2016 తేదీన 1000 నుండి 1200 గంటల వరకు " డయల్ యువర్ SSP"  కార్యక్రమమును నిర్వహించుచున్నాము .
ఈ కార్యక్రమములో POTD మెషిన్లలో ఇబ్బందులు, నెట్వర్క్ కనెక్టివిటీ, నగదు సరఫరా వంటి విషయాలకు సంబంధిoచిన సమస్యలపై అధికారులకు వివరించుకొనవచ్చును
           కార్యక్రమమునందు SSP గారు, AP Online District Coordinator, DWMA Coordinator, మరియు VISION TECH  వారు పాల్గొంటారు. అందుచేత  అవకాశమును తప్పనిసరిగా వినియోగించుకొనవలసినదిగా కోరడమైనది.
ఇందుకు గాను, మీరు 23.08.2016 తేదిన ఉదయం 1000 నుండి 1200 గంటల లోపు ఫోన్ చేయవలసిన నంబరు:   9000590540
Copy to :
1. The Collector & District Magistrate, Prakasam District, Ongole for favour of information.
2. The Project Director, DWMA, Ongole for favour of information with a request to direct the concerned         coordinator to attend the programme.
3. The District Coordinator, APONLINE, Ongole for information and with a request to participate in the   programme.
4. All Sub Divisional Heads in Prakasam division for information and to guide the BPMs in this regard.
5. All the Postmasters/SPMs in Prakasam Division for information, circulation and to guide the BPMs to participate in this programme.
6.The PMG,Vijayawada Region Vijayawada-520003, for favour of information.

                                                                                                                                SD/-
                                                                                                               Sr.,Supdt.,of Post Offices
                                                                                                    Prakasam Division, Ongole-523001

        
             

SOFTSKILL AND CUSTOMER RELATION MANAGEMENT & BUSINESS PROMOTION TRAINING FOR POSTMEN STAFF OF ONGOLE TOWN CONDUCTED ON 13.08.2016 AT DO, PRAKASAM