Monday, 20 March 2017

“నమ్మకం....”



మేల్కొలుపు!

నీలోని నిద్రాణ శక్తిని......


రగుల్గొలుపు!

నీలోని నిబిడీకృత కసిని.....


చెరుపు!....

"కాదు...లేదు..."లను

నీ జీవన నిఘంటువు నుంచి....


కాంక్షించు !

మనసా... వాచా... కర్మణ్యా...“విజయాన్ని”.......!


విహరించు!

ఆ ఆనంద లోకాలలో....


స్వప్నించు!

విజయోల్లాస ప్రపంచాన్ని....


సృష్టించు!

నీదైన భవిష్యత్  ను.....


నమ్ము!

నీకల నిజమౌతుంది....


నీ నమ్మకం!

నిన్ను-విజేతను చేస్తుంది.

[ ప్రపంచ కవితా దినోత్సవ సందర్భం గా...]                                                                               

  రచన:

తీర్ధాల అన్నపూర్ణ వెంకట శర్మఎస్.ఎస్.పి,ప్రకాశం పోస్టల్ డివిజన్,ఒంగోలు-523001.
21.03.2017.

No comments:

Post a Comment