Saturday, 13 August 2016

తోకలేని పిట్ట కు నంబర్ల అనుసంధానం ... పోస్టల్ ఇండెక్స్ నెంబర్..... [ భారత పిన్ కోడ్ దినోత్సవం – ఆగస్టు-15 సందర్భంగా... స్వాతంత్ర్య మరియు పిన్ కోడ్ దినోత్సవ శుభాకాంక్షలతో....]

తోకలేని పిట్ట కు నంబర్ల అనుసంధానం ... పోస్టల్ ఇండెక్స్ నెంబర్.....
[ భారత పిన్ కోడ్ దినోత్సవం – ఆగస్టు-15 సందర్భంగా... స్వాతంత్ర్య మరియు పిన్ కోడ్ దినోత్సవ శుభాకాంక్షలతో....]
భారత దేశం లోని వివిధ గ్రామాలను, పట్టణాలను  సులభంగా  గుర్తించడానికి, చిరునామాను కచ్చితంగా నిర్ధారించడానికి , తపాలా శాఖ పని తీరును సరళతరం గావించడానికి , తపాలా శాఖ ఆధునికీకరణకు - రూపొందించిన విధానమే - పోస్టల్ ఇండెక్స్ నెంబర్
పిన్ కోడ్ ఆవిర్భావం భారత తపాలా వ్యవస్థ లో  ఒక విప్లవందీనిని శ్రీ శ్రీరామ్ బికోజీ వేలంకార్ రుపొందించారు. పిన్ కోడ్ విధానం భారత తపాలా వ్యస్థలో 1972 ఆగస్టు 15 తేదీ నుండి అమలు జరపబడిందిదీనితో ...స్వాతంత్య్ర దినోత్సవం తోపాటు భారతదేశం ప్రతి ఆగస్టు 15  తేదీన  తపాలా పిన్ కోడ్ దినోత్సవాన్ని కూడా  జరుపుకుంటుంది.
పిన్ కోడ్ ప్రవేశ పెట్టక ముందు తపాలా శాఖ లో  పార్సల్స్, ఉత్తరాలు , మనియార్డర్లు వంటి తపాలా ఆర్టికల్స్ రవాణా మరియు వాని బట్వాడా కష్టతరం గా మరియు గందరగోళంగా ఉండేదిపిన్ కోడ్ ఆవిర్భావం తరువాత అది అత్యంత సులభతరంగా మారింది
ఒక గ్రామాన్ని గాని, పట్టణాన్ని గాని గుర్తించడంలో పిన్ కోడ్ విజయం సాధించింది. చరిత్ర గతిని మార్చిందిఅందుకే ఆగస్టు 15  తేదీ పిన్ కోడ్ దినోత్సవంగా ఆవిర్భవించింది.
పిన్ కోడ్ లో ప్రధానంగా 6 నంబర్లు ఉంటాయి.   6 నంబర్లలో మొదటి నంబరు పోస్టల్  రీజియన్ను సూచిస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 9 పిన్ కోడ్ ప్రాంతాలుగా విభజించారు. ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి. వాటిని క్రింద తెలియ చేయడం జరిగింది.
1 - ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, చండీఘర్
2 - ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
3 - రాజస్థాన్, గుజరాత్, డామన్ మరియు డయ్యు, దాద్రా నాగర్ హవేలీ
4 - ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా
5 - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, యానాం (పుదుచ్చేరి జిల్లా)
6 - కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి (యానాం తప్పించి), లక్షద్వీపాలు
7 - పశ్చిమ బెంగాల్, ఒడిషా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అండమాన్ మరియు నికోబార్ దీవులు
8 - బీహార్, జార్ఖండ్
9 - ఆర్మీ పోస్ట్ ఆఫీసు (APO) మరియు ఫీల్డ్ పోస్ట్ ఆఫీసు (FPO)
పైన తెలిపిన రీజియన్ల ను క్రింది విధంగా స్థూలంగా తెలియచేయ వచ్చు.
1&2 - ఉత్తర భారత ప్రాంతం
3&4 - పశ్చిమ భారత ప్రాంతం
5&6 - దక్షణ భారత ప్రాంతం
7&8 - తూర్పు భారత ప్రాంతం
9     - ఆర్మీ పోస్ట్ ఆఫీసు (APO) మరియు ఫీల్డ్ పోస్ట్ ఆఫీసు (FPO).  ఇవి మనదేశం లోని   అన్నిప్రాంతాలలో విస్తరించి వున్నాయి.
భారత దేశాన్ని ఎలా రాష్ట్రాలుగా విభజించారో అలాగే  తపాలా శాఖను సర్కిళ్లు గా విభజించారుపిన్ కోడ్ లోని మొదటి 2 అంకెలు తపాలా శాఖ సర్కిళ్లను సూచిస్తాయి. అవి....   
11                              ఢిల్లీ
12 and 13                 హర్యానా
14 to 16                     పంజాబ్
17                            హిమాచల్ ప్రదేశ్
18 to 19                    జమ్మూ & కాశ్మీరు
20 to 28                    ఉత్తరప్రదేశ్
30 to 34                    రాజస్థాన్
36 to 39                    గుజరాత్
40 to 44                    మహారాష్ట్ర
45 to 49                    మధ్యప్రదేశ్
50 to 53                    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
56 to 59                    కర్నాటక
60 to 64                    తమిళనాడు
67 to 69                    కేరళ
70 to 74                   పశ్చిమబెంగాల్
75 to 77                   ఒడిషా
78                           అస్సాం
79                          ఈశాన్య భారత్
80 to 85                          బీహారు మరియు జార్ఖండు
సర్కిళ్ళనే సబ్ రీజియన్లు అనికూడా అంటారు
పిన్ కోడ్లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి.
ఉదాహరణకు ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయ పిన్ కోడ్ ను పరిశీలిద్దాం...
Ø ఒంగోలు పిన్ కోడ్ - 523 001
Ø ఇందులో 5 ఆంధ్ర, తెలంగాణా మరియు కర్ణాటక రీజియన్  ను సూచిస్తుంది.
Ø ఇందులో 52 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ను సూచిస్తుంది.
Ø ఇందులో 523 ప్రకాశం సార్టింగ్ డిస్ట్రిక్ట్ ను సూచిస్తుంది.
Ø 001 -  లోని మొదటి సున్నా - డెలివరీ పోస్ట్ ఆఫీస్ వుండే సార్టింగ్ రూట్ ను తెలియ చేస్తుంది.
Ø 001 ఒంగోలు ప్రధాన తపాలా ఆఫీసును తెలియ చేస్తుంది
అంటే - 523 001 అనేది , ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం సార్టింగ్ రూట్ లో వున్నా ఒంగోలు ప్రధాన తపాలా ఆఫీసు అని అర్ధం చేసుకోవచ్చు.
విధంగా ఖచ్చితంగా ఒక తపాలా ఆఫీసును పిన్ కోడ్ ద్వారా గుర్తించడం సాధ్యం అవుతుంది
ఒక డెలివరీ  పోస్ట్ ఆఫీస్ క్రింద కొన్ని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులకు  అవి డెలివరీ పోస్ట్ ఆఫీస్ కు అనుసంధానించబడి వుంటాయో దాని పిన్ కోడ్  నెంబరే ఉంటుంది
పిన్ కోడ్ అనేది కేవలం బట్వాడా పని చేసే డెలివరీ పోస్ట్ ఆఫీసులకు మాత్రమే ఉంటుందిఉత్తరాలు డెలివరీ చేయకుండా , సేకరణ మాత్రం చేస్తూ మిగిలిన లావాదేవీలు జరిపే పోస్ట్ ఆఫీసులు కూడా ఉంటాయివాటిని నాన్ డెలివరీ  పోస్ట్ ఆఫీసులని అంటారు. వీటికి పిన్ కోడ్ నెంబర్ ప్రత్యేకంగా ఉండదు. అది డెలివరీ పోస్ట్ ఆఫీస్ పరిధి లో ఉంటుందో దాని పిన్ కోడ్ తో వ్యవహరించ బడుతుంది.
ఏవైనా క్రొత్త పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ అయితే దానికి కూడా విధమైన కన్ఫ్యూజన్ లేకుండా క్రొత్త పిన్ కోడ్ ను కేటాయించేలాగున పిన్ కోడ్ విధానం రూపొందించబడింది.

స్థూలంగా పిన్ కోడ్ తో క్రింది ఉపయోగాలు చెప్పుకోవచ్చు ...
01. దేశం లోని ప్రాతానిదైనా చిరునామాను కచ్చితంగా  గుర్తించడానికి.
02. రెండు ఊర్ల పేర్లు ఒకేరకంగా ఉంటే - వాటిని కచ్చితంగా  వేరుపరిచి గుర్తించడానికి.
03. సత్వర బట్వాడాకు
04. బట్వాడా లో అధునాతన సార్టింగ్ విధానాలను అమలు పరచడానికి మరియు వివిధ సాంకేతిక విధానాలను అనుసంధానించడానికి.
05. తపాలా సేవలలో క్వాలిటీ ని పెంచడానికి.
06. పోస్ట్ మ్యాన్లు అడ్రసులను సులభం గా గుర్తించడానికి.
07. భాషలో చిరునామా వున్నా దానిని పిన్ కోడ్ ఆధారంగా గమ్యానికి పంపించడానికి.
పిన్ కోడ్ నెంబర్  తపాలా శాఖ కంప్యూటరీకరణలో యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గా ఉపయోగపడుతుంది.
ఇలా ఎన్నో ఉపయోగాలతో పిన్ కోడ్ భారత ప్రజలకు సేవలనందిస్తుంది.

ఆధునిక పోకడలు  :-

ఇప్పుడు ఒక డెలివరీ పోస్ట్ ఆఫీసు క్రింద వుండే వివిధ  కార్యాలయాలు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్  మరియు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ మొదలగు వారికి / వానికి  ప్రత్యేక ఎక్స్టెండెడ్ పిన్ కోడ్ నెంబర్ లను ఇవ్వడం జరుగుతుంది.   దీనివల్ల  డైరెక్ట్ గా చిరునామాదారుని  గుర్తించి నేరుగా ఆలస్యం లేకుండా  ఆర్టికల్స్ డెలివరీ చేయడం జరుగుతుంది ఎక్స్టెండెడ్ పిన్ కోడ్ నెంబర్ విధానం వలన ఒక వుత్తరం  పోస్ట్ ఆఫీస్ లో , పోస్ట్ మ్యాన్ ద్వారా, ఎవరికీ డెలివరీ చేయాలో కూడా నిర్ధారించవచ్చు
ఎక్స్టెండెడ్ పిన్ కోడ్ నెంబర్ కొరకు స్థానిక పోస్టల్ డివిజన్ అధికారికి దరకాస్తు చేసుకోవలసి ఉంటుంది

వినియోగ దారులకు విన్నపం : -

మీ ఉత్తరాలపై  కచ్చితమైన పిన్ కోడ్ నంబరును వ్రాయండి ... కచ్చితమైన పిన్ కోడ్ నంబరును  మీ ఉత్తరాలపై వ్రాయడం ద్వారా  మీ ఆర్టికల్స్ ను సత్వర డెలివరీకి సహకరించాలని కోరుతున్నాము.. పిన్ కోడ్ నెంబర్ కొరకు వినియోగదారులు తపాలా శాఖ పిన్ కోడ్ డైరెక్టరీని గాని , స్థానిక తపాలా ఆఫీసులో ఉద్యోగులను కానీ , పోస్ట్ ఆఫీస్  అఫిషియల్ వెబ్ సైట్ : www.indiapost.gov.in   ను గాని సంప్రదించి తెలుసుకొనవచ్చు.


[తీర్థాల .వి. శర్మ]
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్,
ప్రకాశం డివిజన్,
ఒంగోలు - 523 001.





No comments:

Post a Comment