Wednesday, 22 March 2017

PRESS NOTE: DATED: 22.03.2017

భారత తపాలా శాఖ

సీనియర్ సూపరింటెండెంట్ వారి కార్యాలయము, ప్రకాశం పోస్టల్ డివిజన్, ఒంగోలు – 523001

PRESS NOTE: DATED: 22.03.2017



సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ ప్రకాశం డివిజన్ వారు ప్రజలందరికి ఈ క్రింది విధముగా ఒక విజ్ఞప్తి చేయుచున్నారు.

ప్రకాశం  పోస్టల్  డివిజన్,  42  మండలాల  పరిధి కలిగియున్నది.  ఇందులో 4 హెడ్ పోస్టాఫీసులు - అనగా చీరాల, కందుకూరు, పొదిలి, ఒంగోలు, వాటిక్రింద 94 సబ్ ఆఫీసులు మరియు 565 బ్రాంచ్ పోస్టాఫీసులు కలవు. ఈ పోస్టాఫీసుల నుండి ప్రజలకు వివిధ రకముల పోస్టల్ సేవలు అందించబడుచున్నవి. ప్రజలకు ఈ పోస్టల్ సేవల విషయములో ఏమైనా ఫిర్యాదులు ఉన్నచో, తమ ఫిర్యాదులను ఈ క్రింద తెలపబడిన మొబైల్ నెంబర్ కు  whatsapp ద్వారా సీనియర్ సూపరింటెండెంట్, ప్రకాశం పోస్టల్ డివిజన్ గారికి తెలియపరచుకోనవచ్చును.

80962 16356

పై  నెంబర్ కు  కేవలం ప్రజలే కాకుండా డిపార్టుమెంటు లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమ సమస్యలను, whatsapp ద్వారా తెలియపరుచుకోనవచ్చును. కావున ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకొనగలరు. తపాలా శాఖకు సంబందించిన ప్రకాశం పోస్టల్ డివిజన్ పరిధి లోని  సమస్యలను త్వరితగతిన పరిష్కరించటానికి ఈ మాధ్యమమును ఉపయోగింకొనగలరని  కోరడమైనది.          

                                                     ఇట్లు,

 సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్,

      ప్రకాశం డివిజన్,ఒంగోలు–523001.

No comments:

Post a Comment