Monday, 26 September 2016

భారత తపాలా శాఖ పత్రికా ప్రకటన dated :26.09.2016

భారత తపాలా శాఖ పత్రికా ప్రకటన dated :26.09.2016
అక్టోబర్ 9 వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా భారత తపాలా శాఖలో తపాలా వారోత్సవములు  09.10.16 వ తేదీ నుండి 15.10.16 వ తేదీ వరకు  ఈ క్రింద  తెలుపబడిన విధముగా నిర్వహించబడుతున్నవి.
Date
Day
Description

9 అక్టోబర్ 2016
ఆదివారం
వరల్డ్ పోస్ట్ డే
10 అక్టోబర్ 2016
సోమవారం
సేవింగ్స్ బ్యాంక్ డే
13 అక్టోబర్ 2016
గురువారం
మెయిల్ డే & ఫిలాటలీ డే
14  అక్టోబర్ 2016
శుక్రవారం
PLI డే
15  అక్టోబర్ 2016
శనివారం
బిజినెస్ డెవలప్ మెంట్ డే
ఇందులో భాగంగా ప్రధాన మంత్రి మన్ కీ బాత్ లోచెప్పిన విధముగా విద్యార్ధి విద్యార్ధినిలను భారత ప్రభుత్వ పురోభివృద్ధిలో భాగస్వాములను చేయుటకు,వారి యొక్క మనోగతమును తెలుసుకొనుటకు 15.10.16 తేదీన Being positive is the biggest strength” అను విషయము మీద ఇంగ్లీష్ లో లేఖనము(LETTER WRITING) మరియు Our future will be technology driven.we need to embrace it” & “India’s Strength lies in Simplicity of Indians and their Unity” అను విషయముల మీద తెలుగు లేదా ఇంగ్లీష్ లో వ్యాసరచన (ESSAY WRITING) పోటీలు పాఠశాల మరియు కళాశాల  విద్యార్ధి విద్యార్ధినులకు భాగ్య నగర్ రెండవ వీధిలో వున్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కార్యాలయములో  నిర్వహించబడుతున్నవి. ఈ పోటిలలో ప్రధమ స్థానము, ద్వితీయ స్థానము,మరియు తృతీయ స్థానం పొందిన వాళ్ళకు బహుమతులు ఇవ్వబడును. మరియు లేఖనములో మొదటి ఐదు స్థానములలో ఎంపిక అయిన విద్యార్దుల యొక్క పత్రములను విజయవాడలో నిర్వహించబడే రీజినల్,సర్కిల్ స్థాయి సెలెక్షన్స్ లో పరిశీలించబడును.”Our future will be technology driven.We need to embrace it”అను వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచినవారు కేవలం “e-post” ద్వారా  మాత్రమే తమ ఎంట్రీలను పంపించవలెను.”e-post” ద్వారా పంపుటకు ఒంగోలు,చీరాల, కనిగిరి, కందుకూరు ప్రధాన తపాల కార్యాలయములను సంప్రదించగలరు. “India’s strength lies in simplicity of Indians and their unity” వ్యాసరచన పోటీలో పాల్గోనదలచినవారు, ఒంగోలు ప్రధాన తపాల కార్యాలయమునందు “My Stamp” పొందుటకు తగు పైకమును చెల్లించిన రశీదును తప్పక జతచేయవలెను.
ఈ పోటిల గురించి ఇతర వివరములకు ఒంగోలు,చీరాల ,కందుకూరు,కనిగిరిలోగల హెడ్ పోస్ట్ ఆఫీసులను సంప్రదించగలరు.  కావున,ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పాఠశాల స్థాయి,కళాశాల స్థాయి విద్యార్ధి విద్యార్ధినులు అధిక  సంఖ్యలో పాల్గొనవలనని తెలియచేయుచున్నాము.
                                                                                                                    ఇట్లు,
                                                                                          టి..వి. శర్మ
                                                                                                               SSPOs  ప్రకాశం డివిజన్.


No comments:

Post a Comment