A BLOG FOR THE STAFF OF PRAKASAM POSTAL DIVISION AND BY THE STAFF OF PRAKASAM POSTAL DIVISION OF VIJAYAWADA REGION IN AP CIRCLE
Thursday, 29 September 2016
Tuesday, 27 September 2016
మెరుగైన ఆఫీసు వాతావరణం కోసం 4 చిట్కాలు
మీరు ఒక సంస్ధ యొక్క నాయకులైనా లేదా సాధారణ ఉద్యోగి అయినా , మీ చుట్టూ ఒక అందమైన పని వాతావరణాన్ని సృష్టించే బాధ్యత మీ మీదనే ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మనకు దోహదపడే కొన్ని చిట్కాలను సద్గురు మనకు ఈ వ్యాసంలో అందజేస్తున్నారు.
#1 “కష్టపడి” పని చేయటం మానండి!
చిన్నప్పటి నుండీ ఎవరూ మనకు ఆనందంగా చదువుకోమని, ప్రేమగా పని చేయమనీ చెప్పలేదు. అందరూ మనకి, “కష్టపడి చదవండి!, కష్టపడి పని చేయండి!” అనే చెప్పారు. అందువల్ల అందరూ ప్రతిదీ కష్టపడి చేస్తున్నారు, చివరకు జీవితం సులభం కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిదీ కష్టపడి చేయటం అనేది అహం యొక్క స్వభావం. ఎందుకంటే అందరికన్నాఒక మెట్టు పైన ఉండాలన్నదే దానికున్న ఒకే ఒక్క ముఖ్యమైన లక్షణం. అలా జివించడం చాలా బాధాకరం. మీరు చేసేదంతా అలానే చేస్తున్నప్పుడు, ప్రతిదీ కష్టపడి చేయటం అనేది సహజంగానే సంతృప్తికి మూలకారణం అవుతుంది. మీరు ఏదైనా ఆనందంగా చేస్తే, మీకు ఏమీ చేసినట్లే అనిపించదు.
మీరు ఎంతో పని చేసి కూడా ఏమీ చేయని అనుభూతితో ఉండడం ఒక అద్భుతం, అవునా, కాదా? పని చేయడం అలా ఉండాలి. మీరు రోజుకి 24 గంటలు పనిచేయవచ్చు, కానీ మీకు ఏమీ చేసినట్లు అనిపించకపోతే, మీ మీద ఆ పనికి సంబంధించిన ఏ భారమూ ఉండదు. మీరు ఆ భారాన్నంతా మీ తల మీద మోస్తూ ఉంటే, మీ శక్తిసామర్ధ్యాలు ఎప్పటికీ వ్యక్తమవవు. ఇంకా మీకు మటుకు రక్తపోటు, మధుమేహం లేదా అల్సర్లు రావచ్చు.
#2 పోటీని దాటి వెళ్ళండి!
నిజమైన మానవ సామర్ధ్యం పోటీలో వ్యక్తమవ్వదు. మీరు ఎవరితో అయినా పోటీ పడుతున్నప్పుడు, మీరు అతని కన్నా ఒక అడుగు ముందుండాలని అనుకుంటారు, అంతే! మీకున్న పూర్తి సామర్ధ్యత గురించి మీరు ఆలోచించరు. నిజమైన సామర్ధ్యం ఏ నిర్భంధతలూ లేని విశ్రాంత స్థితిలోనే వ్యక్తమౌతుంది. మీరు ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు, శరీరమూ తమ పూర్తి సామర్ధ్యంతో పనిచేయగలుగుతాయి. సాధారణంగా మీరు మనుషులను విశ్రాంతిగా ఉండమంటే, వారు నిర్లక్ష్యంగా ఉంటారు. మీరు వారిని తీవ్రతతో ఉండమంటే, వారు ఒత్తిడికి గురవుతారు. మీరు ఈ తేడాని గమనించారా? తీవ్రతతో ఉన్నప్పుడు కూడా విశ్రాంతిగా ఉండటం మీకు తెలవాలి. మీరు తీవ్రతతో, అదే సమయంలో విశ్రాంతిగా ఉండగలిగితే, మీకున్నసామర్ధ్యం పూర్తిగా ఉపయోగించుకోబడుతుంది.
#3 ఎల్లప్పుడూ ఒక స్వచ్ఛంద కార్యకర్తలా ఉండండి!
మీరు స్వచ్ఛంద సేవ చేసినప్పుడు, మీ పనే ఒక సమర్పణ అవుతుంది. కానీ మీ ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ చేసే అదే పని మీకు భారమవుతుంది. అదేపని, అదేమీరు, కానీ చాలా తేడా. మీరు ఒక పనిని ఆనందంగానూ చేయగలరు, విసుగ్గానూ చేయగలరు. అందుకని మీరు మీ ఆఫీసులో చేసే ప్రతిదానిని కూడా ఒక సమర్పణగా ఎందుకు చేయకూడదు? అలా చేయకుండా మిమ్మల్ని ఏది ఆపుతోంది?
మీరు ఎల్లప్పుడూ ఒక స్వచ్ఛంద కార్యకర్తలా ఉండాలి. స్వచ్చందమంటే మీ జీవితాన్ని ఇష్టంగా నిర్వహించడం. ఇప్పుడు మీరు “నేను స్వ చ్ఛందకార్యకర్తని” అంటే దాని అర్ధం “ నేను చేసే ప్రతిదీ కూడా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను!“ అని. అవునా, కాదా? కాబట్టి ఇలా ఎంపిక చేసుకునే అవకాశం మీకుంది. మీరు మీ జీవితాన్ని ఇష్టంగా అయినా లేదా అయిష్టంగా అయినా నిర్వహించవచ్చు. అది మీరు ఇష్టంగా చేస్తే, అది ఒక ప్రేమవ్యవహారమై మీకొక స్వర్గంలా అనిపిస్తుంది. అదే మీరు అయిష్టంగా చేస్తే, అది మీకొక నరకం అవుతుంది. ఒక స్వచ్ఛంద కార్యకర్త అవ్వటమంటే, ఎదో ప్రోగ్రాంలో గిన్నెలు కడిగి, కూరలు తరగటం కాదు. అది అన్ని రకాల పరిస్దితులను అంగీకరించి, మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని సరైన తీరులో ఇష్టంగా నిర్వహించుకోవడం, అయిష్టంగా కాదు. అయిష్టత ఏర్పడిన మరుక్షణం, మీ జీవితంలో ఎంతో అద్భుతమైనది జరుగుతున్నా కూడా మీరు జీవితంలో ఓడిపోయినట్లే భావిస్తారు.
#4 మీ సహోద్యోగుల ఉత్తమ సామర్ధ్యాన్ని వెలికి తీయండి!
మీరు ఒక పరిశ్రమని నడుపుతున్నా, కుటుంబాన్ని నడుపుతున్నా, మీకు ఏదైనా పని పూర్తవ్వాలంటే లేదా మీ పక్కవారిలోని ఉత్తమ సామర్ధ్యాన్ని బయటకి తీయాలంటే, వారు మిమ్మల్నిఎదో విధంగా ప్రేమించాలి. కానీ వారు మీతో ప్రేమలో పడే ముందు, వారు ఎలాంటి వారు అన్న దానితో సంబంధం లేకుండా, మీరు వారితో ప్రేమలో పడాలి. అప్పుడే వారు మిమ్మల్ని ప్రేమించి , మీ కోసం వారు చేయగలిగినంత చేస్తారు.
Monday, 26 September 2016
భారత తపాలా శాఖ పత్రికా ప్రకటన dated :26.09.2016
భారత తపాలా శాఖ
పత్రికా ప్రకటన dated :26.09.2016
అక్టోబర్ 9 వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా భారత
తపాలా శాఖలో తపాలా వారోత్సవములు 09.10.16 వ తేదీ నుండి 15.10.16 వ తేదీ వరకు ఈ క్రింద
తెలుపబడిన విధముగా నిర్వహించబడుతున్నవి.
Date
|
Day
|
Description
|
9 అక్టోబర్ 2016
|
ఆదివారం
|
వరల్డ్ పోస్ట్ డే
|
10 అక్టోబర్ 2016
|
సోమవారం
|
సేవింగ్స్ బ్యాంక్ డే
|
13 అక్టోబర్ 2016
|
గురువారం
|
మెయిల్ డే & ఫిలాటలీ డే
|
14 అక్టోబర్ 2016
|
శుక్రవారం
|
PLI డే
|
15 అక్టోబర్ 2016
|
శనివారం
|
బిజినెస్ డెవలప్ మెంట్ డే
|
ఇందులో భాగంగా
ప్రధాన మంత్రి మన్ కీ బాత్ లోచెప్పిన విధముగా విద్యార్ధి విద్యార్ధినిలను
భారత ప్రభుత్వ పురోభివృద్ధిలో భాగస్వాములను చేయుటకు,వారి యొక్క మనోగతమును తెలుసుకొనుటకు 15.10.16 వ తేదీన “Being
positive is the biggest strength” అను విషయము మీద ఇంగ్లీష్ లో లేఖనము(LETTER
WRITING) మరియు “Our future will be technology driven.we need to
embrace it” & “India’s Strength lies in Simplicity of Indians
and their Unity” అను విషయముల మీద తెలుగు లేదా ఇంగ్లీష్ లో వ్యాసరచన (ESSAY
WRITING) పోటీలు పాఠశాల మరియు
కళాశాల విద్యార్ధి విద్యార్ధినులకు భాగ్య
నగర్ రెండవ వీధిలో వున్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్
కార్యాలయములో నిర్వహించబడుతున్నవి. ఈ పోటిలలో ప్రధమ స్థానము, ద్వితీయ స్థానము,మరియు తృతీయ స్థానం పొందిన వాళ్ళకు బహుమతులు ఇవ్వబడును. మరియు లేఖనములో మొదటి
ఐదు స్థానములలో ఎంపిక అయిన విద్యార్దుల యొక్క పత్రములను విజయవాడలో నిర్వహించబడే
రీజినల్,సర్కిల్ స్థాయి సెలెక్షన్స్
లో పరిశీలించబడును.”Our future will be technology driven.We need to embrace
it”అను వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచినవారు కేవలం “e-post” ద్వారా మాత్రమే తమ
ఎంట్రీలను పంపించవలెను.”e-post” ద్వారా పంపుటకు ఒంగోలు,చీరాల, కనిగిరి, కందుకూరు ప్రధాన తపాల కార్యాలయములను సంప్రదించగలరు. “India’s strength lies in simplicity of Indians
and their unity” వ్యాసరచన పోటీలో పాల్గోనదలచినవారు, ఒంగోలు ప్రధాన తపాల కార్యాలయమునందు “My Stamp” పొందుటకు తగు పైకమును చెల్లించిన రశీదును తప్పక జతచేయవలెను.
ఈ పోటిల గురించి
ఇతర వివరములకు ఒంగోలు,చీరాల ,కందుకూరు,కనిగిరిలోగల హెడ్ పోస్ట్ ఆఫీసులను సంప్రదించగలరు. కావున,ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పాఠశాల స్థాయి,కళాశాల స్థాయి విద్యార్ధి విద్యార్ధినులు అధిక సంఖ్యలో పాల్గొనవలనని తెలియచేయుచున్నాము.
ఇట్లు,
టి.ఏ.వి. శర్మ
SSPOs ప్రకాశం డివిజన్.
Sunday, 25 September 2016
Wednesday, 21 September 2016
NREGS CO-ORDINATION CUM MOTIVATIONAL MEETING HELD AT DWAMA OFFICE, ONGOLE ON 21.09.2016 WITH 78 BPMs of WEST SUB DIVISION. PD, DWAMA APPRECIATED THE EFFORTS OF BPMs FOR EFFECTIVE NREGS DISBURSEMENTS. WEST BPMs SUBMITTED Rs.50000.00 + RPLI PREMIUM ON NEW RPLI POLICIES ALONG WITH NEW ACCOUTS, APY, PMJJBY, PMSBY etc., IN SUFFICIENT NUMBER. CONGRATULATIONS TO IP,WEST AND HIS TEAM...
Monday, 19 September 2016
Sunday, 11 September 2016
Wednesday, 7 September 2016
Sunday, 4 September 2016
పత్రిక ప్రకటన తేది: 04.09.2016
19.08.16 న ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారా పోస్ట్ మెన్ /మెయిల్ గార్డ్ పోస్టులకు అభ్యర్దులు దరకాస్తు చేసుకునుటకు చివరి తేది 04.09.2016 అని తెలియజేసి ఉన్నాము.
అభ్యర్దుల ఆసక్తి ని దృష్టిలో ఉంచుకుని దరకాస్తు చేసుకునుటకు చివరి తేదిని 10.09.2016 వరకు పొడిగించటమయినది.
ప్రకాశం పోస్టల్ డివిజన్ పరిది లో ఈ క్రింది విధంగా ఖాళీలు వున్నవి.
Oc-03 SC-01 OBC-01 TOTAL -05 మరియు మాజీ సైనికులకు ఒక పోస్టు రిజర్వు చేయడమయినది.
ఈ పరీక్షకు దరకాస్తు ను ఆన్ లైన్ లో చేసుకోవలసి వుంటుంది .ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకొనేటప్పుడు- కట్టిన పరీక్షా ఫీజు వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచవలసి ఉంటుంది .పరీక్షా ఫీజును అభ్యర్దులు ఈ క్రింద తెలిపిన పోస్ట్ ఆఫీసులలో చెల్లించి రసీదు ను పొంది ఆ వివరాలను ఆన్ లైన్ లో అప్లికేషను పూర్తీ చేయునపుడు పొందు పరచవలసి వుంటుంది. అభ్యర్దులు దీనిని గమనించవలసింది గా కోరుచున్నాము . పరీక్షా ఫీజు ను ఈ క్రింద తెలిపిన పోస్ట్ ఆఫీస్ ల లో చెల్లించవచ్చును .
ఒంగోలు H.O
|
కందుకూరు H.O
|
కనిగిరి H.O
|
చీరాల H.O
|
సింగరాయకొండ S.O
|
పర్చూరు S.O
|
పొదిలి S.O
|
అద్దంకి S.O
|
లాయర్ పేట్ S.O
|
మరిన్ని వివరములకు www.appoost.in ను కానీ లేదా సమీప పోస్ట్ ఆఫీస్ ను కానీ సంప్రదించగలరు .
[టి. ఏ. వి. శర్మ]
Sr.Supdt of Post offices, Prakasam Division,Ongole-523001.
Subscribe to:
Posts (Atom)
-
Please click on this link to view the Compendium on Processing and Disposal of Public Complaints
-